6, జూన్ 2018, బుధవారం

వారసులు (నాటిక) 2017-18

వారసులు

(సాంఘిక నాటిక)

రచన : విద్యాధర్ మునిపల్లె బి.ఏ.,
దర్శకత్వం : వేముల మోహనరావు

ఈ నాటికను విద్యాధర్ మునిపల్లె ఈనాడు ఆదివారం పుస్తకంలో పడిన రామచంద్రారెడ్డి అనే అంధ ఉపాధ్యాయుడి జీవితంపై వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని రచించటం జరిగింది. ఈ నాటికను విద్యాధర్ మునిపల్లె 2017లో సత్యసాయికళాపీఠం (విజయవాడ) వారు నిర్వహించిన నాటిక రచనల పోటీలకు ‘‘మానవత’’ అనేపేరుతో పంపగా వారి ఎంపికల్లో ఈ నాటిక నిలవలేదు. అయినా దీనిని ప్రదర్శించాలనే తలంపుతో పరుచూరి రఘుబాబు స్మారక కళాపరిషత్ వారు నిర్వహించిన నాటికల పోటీల ప్రాధమిక పరిశీలనకు ఎంట్రీ కట్టారు. అయినా కూడా ఈ నాటిక సెలక్ట్ కాలేదు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బృందావన్ గార్డెన్స్, వెంకటేశ్వరస్వామి దేవాలయం(గుంటూరులో) ఈ నాటిక ప్రదర్శించటం జరిగింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తర్వాత ఈ నాటికను తెనాలిలో జరిగిన నంది నాటకోత్సవాలలో ప్రదర్శించగా అక్కడ కూడా ప్రేక్షకులు మైమరచిపోయారు. ఈ నాటిక లింక్ ని కింద వున్న డిస్ర్కిప్షన్ లో ఇస్తున్నాను. ప్రదర్శించాలనుకున్న వారు సంప్రదించండి.. సెల్: 8522990888 విద్యాధర్ మునిపల్లె.



21, మే 2018, సోమవారం

నాలుగో మర్కటం (సాంఘిక నాటిక) 2017-18

నాలుగో మర్కటం 

(సాంఘిక నాటిక)
రచన : శ్రీ బెహరా లక్ష్మీ నారాయణ
దర్శకత్వ : శ్రీ యాసం కృష్ణమూర్తి

ఈ నాటికను బెహరా లక్ష్మీ నారాయణ రచించారు. ఈ నాటికను పరాధీనభారతం అనేపేరుతో ప్రచురించిన నాటక సంకలనంలో ప్రచురించగా పేరు ప్రఖ్యాతలున్న సినీ,నవలా, కథా రచయితలు ముందుమాటలో శ్లాఘించారు. ఈ నాటిక చదవదలచిన వారు కింద వున్న లింక్ ను ప్రెస్ చేసి డౌన్ లోడ్ చేసుకొని చదువుకోగలరు. ప్రదర్శించాలని కోరుకునే వారు బెహరా లక్ష్మీనారాయణను సంప్రదించగలరు. వారి సెల్ నెంబరు : 99635 00128


ఇందులో పాత్రలు
చంద్రశేఖర్
సూర్యనారాయణ
క్రిష్ణమూర్తి
ఈశ్వరరావు
ప్రభుదాస్
రిటైర్ ఉద్యోగులు
వరలక్ష్మి
హేమంత్
డిఎస్పీ
మీడియా
మర్కట పాత్ర

20, మే 2018, ఆదివారం

విశ్రుతోర్వశీయం (నాటకం)

విశ్రుతోర్వశీయం

(పద్యనాటకం)

రచన : బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి
మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు విశ్రాంత సంస్కృతాంధ్ర భాషోపన్యాసకులు. వీరు ఆంధ్రకళాపరిషత్కళాశాలలో కొనసాగారు. ఈ నాటకాన్ని రాజమండ్రికి చెందిన శిరోమణి యరసూరి మల్లికార్జునరావు గారు ప్రకాశించారు(ప్రచురించారు).
రచయిత మాటలు

శృంగార ప్రధానము వీరాద్భుతకరుణాద్యంగము నవరంగము నైన యీ చిన్ని నాటకమున ప్రధాన నాయికానాయకు లూర్వశీవిశ్రుతులు. సూర్య పురాణములోని వీరి పరస్పరానురాగకథ యిందలి పధానేతివృత్తము, ఆధికారికమైన యావస్తువు దృశ్యకావ్యోచిత మగుటకె ప్రాసంగిక వస్తు వొకింత యిందుకల్పితమైనది. దానితో గొన్ని కొత్తపాతములు నిందుపవేశించినవి. అందుచే నిది మిశ్రవృతమై నది .
రూపకము వస్తుపాతరసపోషణమున సముచితమై పదర్శనరమ్య మయ్యె నేని, యది పూర్వరూపకలక్షణము. ననుసరింపకపోయినను హాని లేదన్న భావమును నాయాంధదశరూపక పీఠికలో సూచించియున్నాను, ఇది యట్లు సముచితమో కాదో, అది సహృదయులైన సామాజికులు నిర్ణయింతురు. కాని పూర్వలక్షణము నతిక్రమించి యంకవిష్కంభము లకు బదులుగా నేనిందు రంగముల నేర్పఱచియున్నాను.

ఈ కావ్యము నిర్మించి యైదు సంవత్సరము లైనది. ఒకమాటు ప్రదర్శింపఁజేసి ప్రకటింత మని చూచితిని గాని, ఆయత్నము కొనసాగ లేదు. దీనిని విన్న రసజ్ఞులు కొందడి ప్రోత్సాహమునను, 'మని తులు శ్రీ అప్పా ద్వేదుల సీతారామయ్య గారి (బి. ఏ. యల్. టి) సముత్సాహ బలమునను నేటి కిది ముద్రితమైనది. నాటకరసజ్ఞులు దీనిని సాదర ముగా నవలోకించుటయే నాకృషికి ఫలము. ధవళేశ్వరము ).
ఇందువచ్చు పాత్రము లు
--------------------------
విశూతుఁడు - యాదవరాజునాయకుఁడు
శ్రీకంఠుఁడు—తిన్మంత్రిపుత్రుడు
కిన్నరుఁడు
కణ్వమహర్షి
భార్గవానందుఁడు - ప్రధానమంత్రి
గిరినాధుఁడు
గంగాదాసు
గంధర్వవీరుఁడు
ఊర్వశి - నాయికి
రుచిమతి - చెలికత్తె
కిన్నరి
పతివ్రత- విశుతధర్మపత్ని
మల్లిక-పరిచారిక
ఇందు రేఖ - గంధర్వాంగన
వందిమాగధాదులు

ఈ నాటకము చదవదలచిన వారు ఈ కింది లింక్ ని ప్రెస్ చేయగలరు.

పరాధీనభారతం (నాటకం) 2017-18

పరాధీనభారతం

(సాంఘికనాటకం)

రచన : బెహరా వెంకట లక్ష్మీనారాయణ
దర్శకత్వం : యాసం కృష్ణమూర్తి
ఇందులోని పాత్రలు
----------------------
రాజారావు
గణపతి
జితేంద్ర
రాకేష్
అనిల్
విశ్వనాథ్
సురేష్
మాధవి
విలేకరులు 2
సర్పంచ్
అమెరికా రంగయ్య

నాటకం ప్రదర్శించాలనుకునేవారు బెహరా లక్ష్మీనారాయణ ను సంప్రదించండి. 99635 00128

ఈనాటకం చదవాలనుకుంటే వెంటనే  కింద వున్న లింక్ ను ప్రెస్ చేయండి.

19, మే 2018, శనివారం

బృహన్నల (నాటకం) 1915


బృహన్నల నాటకం ధర్మవరం రామకృష్ణమాచార్యులు 1915 రచన చేయగా యస్.మూర్తి ఆర్ట్ కంపెనీవారి, కపాలి ముద్రాక్షరశాల, మద్రాసు వారు నిర్వహించారు. ఈ నాటకం చదవ దలచిన వారు క్రింద వున్న లింక్ ను ప్రెస్ చేయండి.

బృహన్నల

ఉత్తర రామ చరిత్ర (నాటకం) 1920

ఉత్తర రామచరిత్ర (నాటకం)

వేదం వెంకటరాయశాస్త్రి


Publication date 


పురూరవ (నాటకం) 1947

పురూరవ నాటకం చలం గారి రచన. దీనిని వీరు 1947లో రచించారు. దేశీ ప్రెస్ విజయవాడ వారి ద్వారా ముద్రణ వెలువడింది. దీనిని 1957లో పునర్ముద్రణ చేశారు. ఈ నాటకం చదవదలచుకున్నవారు క్రింద వున్న లింక్ ను ప్రెస్ చేయండి.

పురూరవ (నాటకం) 1947

18, మే 2018, శుక్రవారం

సుప్రభాతం (నాటిక) 2014-2015

సుప్రభాతం

సాంఘికనాటిక

రచన  : విద్యాధర్ మునిపల్లె బి.ఏ.,


ఈ నాటిక 2015లో తెలుగుకళాసమితి, కువైట్ వారి రచనల పోటీలకు గాను రచన చేసింది. ఈ నాటికకు కూడా ఆ సంవత్సరం ప్రోత్సాహక బహుమతి లభించింది. ఈ నాటికను అప్పటి నుండి ప్రదర్శించటానికి చాలా సమాజాలు ముందుకు వచ్చి చదివి బాగుందని చెప్పినా కూడా సాహసం చెయ్యలేక పోయారు. ఆతర్వాత మూడు నెలలకి ఉషోదయ ఆర్ట్స్ వెనిగండ్లకు చెందిన నాటకసమాజం వద్ద ఈనాటిక వుంది. ప్రతి సంవత్సరం ఈ నాటికను బయటికి తియ్యాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఎందుకనో ఆ నాటిక బయటికి రాలేక పోతోంది. బహుశ ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇందులోని పాత్రలు

1.వీరభద్రం
2.వెంకటేశ్వరరావు
3.కరీముల్లా
4. వినయ్
5. వాసు
6.భారతి


విద్యాధర్ మునిపల్లె : 8522990888

నాటిక చదువాలనుకునేవారు ఈ క్రింద ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేయండి.

స్వరార్ణవం (సాంఘికనాటిక) 2014

స్వరార్ణవం

సాంఘికనాటిక

రచన : విద్యాధర్ మునిపల్లె
ఈ నాటిక శ్రీ విద్యాధర్ మునిపల్లె 2014లో రాయటం జరిగింది. దీనిని ఇంతవరకూ ప్రదర్శించలేదు. తెలుగుకళాసమితి, కువైట్ వారు నిర్వహించిన రచనల పోటీల్లో ప్రోత్సాహక బహుమతి పొందింది. అయితే ఏ కారణం వల్లనో ఈ నాటిక తీసుకొని, దానిని ప్రదర్శించటానికి ప్రయత్నించినా కూడా ప్రదర్శించలేకపోయారు. ఈ నాటిక ఇప్పటికీ ప్రదర్శించే వాళ్ళకోసం ఎదురు చూస్తోంది.

ఈ నాటికలోని పాత్రలు : 

1. శంకర్ దీక్షిత్
2. శరభయ్య
3. శివయ్య
4. సూర్యం
5. సునాదమాల

ఈ నాటిక ప్రదర్శించాలనుకునేవారు విద్యాధర్ మునిపల్లె : 8522990888
చదవాలనుకునేవారు కింద వున్న లింక్ మీద నొక్కండి.

భగవద్గీత (సాంఘికనాటిక) 2018

భగవద్గీత

సాంఘిక నాటిక

ఈ నాటిక 2017 డిసెంబరులో శ్రీ విద్యాధర్ మునిపల్లె ఈ నాటిక రాయటం జరిగింది.  ఈ నాటికను కూడా ఇంతవరకూ ఎవ్వరికీ ఇవ్వలేదు. దీనిని ప్రదర్శించాలనుకునే వారు విద్యాధర్ మునిపల్లె : 8522990888 సంప్రదించండి. తగిన మార్పులు చేర్పులు చేయాల్సి వుంది.

ఇందులోని పాత్రలు
-------------------------
1.కృష్ణమూర్తి
2. విశ్వనాథ్ (లాయర్)
3. గాంధీ (35)
4. సి.ఐ.
5. సత్య


ఈ నాటిక చదవదలచిన వారు క్రింద వున్న లింక్ ని ప్రెస్ చేయండి. 

అవనీసూక్తం (సాంఘిక నాటిక) 2018

అవనీసూక్తం

సాంఘిక నాటిక

రచన : విద్యాధర్ మునిపల్లె
ఈ నాటిక శ్రీ విద్యాధర్ మునిపల్లె 2018లో రచన చేశారు. దీనిని ఇంతవరకూ ప్రదర్శించలేదు.  18మే2018 నాటికి. ఈ నాటిక చదివి ఎవరైనా ఇంట్రస్ట్ వున్న వారు ప్రదర్శించదలచుకుంటే సంప్రదించండి. 

విద్యాధర్ మునిపల్లె : 8522990888
ఇందులోని పాత్రలు
---------------------
1. విశ్వం
2. విజయ
3. ఆనంద్
4. జయదేవ్

ఈ నాటిక లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. డౌన్ లోడ్ చేసుకోండి.
అవనీ సూక్తం (సాంఘిక నాటిక)

పిల్లి పంచాంగం (హాస్యనాటిక) 2016

పిల్లిపంచాంగం

హాస్యనాటిక

రచన : శ్రీ విద్యాధర్ మునిపల్లె బి.ఏ.,
దర్శకత్వం : శ్రీ నాయుడు గోపి
పిల్లి పంచాంగం నాటికను శ్రీ విద్యాధర్ మునిపల్లె 2015 సంవత్సరం సుమధుర హాస్యనాటికల పోటీ కోసం రచించినది. శ్రీ నాయుడు గోపి గారి ప్రోత్సాహంతో రచించిన మొట్టమొదటి హాస్యరచన. దీనిని కేవలం ఒకసారి మాత్రమే ప్రదర్శించారు. చూసిన ప్రతి వారూ దీనిని ఆస్వాదించారు. కానీ ఎందుకో పరిషత్ వారికి మాత్రం నాటిక నచ్చలేదు. బహుశ రచయిత ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశానని భావించారేమో.

ఈ నాటిక ప్రదర్శించాలనుకునే వారు సంప్రదించండి విద్యాధర్ మునిపల్లె : 8522990888

ఈ నాటిక చదవదలచుకున్న వారు ఈ క్రింది లింక్ ను ప్రెస్ చేయండి

మంచివాడు (సాంఘిక నాటిక) 2016

మంచివాడు

సాంఘిక నాటిక

రచన : విద్యాధర్ మునిపల్లె
దర్శకత్వం : యాసం కృష్ణమూర్తి
ఈ నాటిక విద్యాధర్ మునిపల్లె 2016లో రచించారు. దీనిని 2016వ సంవత్సరం గుంటూరులో జరిగిన నందినాటకోత్సవాలలో కావలికి చెందిన శ్రీ ఆర్ట్స్ నాటకసమాజం వారు ప్రదర్శించారు. ఈ నాటికను వారు పరాధీనభారతం అనే నాటికల సంకలనం ద్వారా వెలువరించారు. ఈ నాటికకు పేరొందిన రచయితలు ముందుమాట రాయటం జరిగింది. ఈ నాటిక ప్రదర్శించదలచుకున్నవారు దయచేసి కాంటాక్ట్ అవ్వండి. 

ఇందులోని పాత్రలు... 

1.రామభద్రయ్య
2.బాబూరావు
3.వంశీ
4.కౌశిక్
5.పార్థసారధి
6.రామలక్ష్మి

విద్యాధర్ మునిపల్లె : 8522990888

ఈ నాటిక చదవదలచుకున్నవారు. ఈ కింది లింక్ ని క్లిక్ చేయండి.

శ్రీ గురురాఘవేంద్రచరితం (పద్యనాటకం) 2013-14

శ్రీ గురురాఘవేంద్రచరితం

ఆధ్యాత్మిక పద్యనాటకం

రచన : విద్యాధర్ మునిపల్లె బి.ఎ.,
దర్శకత్వం : నాయుడు గోపి

శ్రీ గురు రాఘ‌వేంద్ర‌ చ‌రితం ప‌ద్య‌నాట‌కం 2013లో విద్యాధ‌ర్ మునిప‌ల్లె ర‌చించారు. దీనిని పెద‌కాకాని గంగోత్రి నాట‌క స‌మాజంవారు ప్ర‌ద‌ర్శించారు. అనేక చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు అందుకున్న ఈ ప‌ద్య‌నాట‌కానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సాక్షాత్తు రాఘవేంద్రస్వామి ఆవాస‌మై కొలువైన మంత్రాల‌యం పుణ్య‌క్షేత్ర శ్రీ‌మ‌ఠ ప్రాంగ‌ణంలో ఈ ప‌ద్య‌నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించి పీఠాధిప‌తుల మ‌న్న‌న‌లు అందుకున్నారు విద్యాధ‌ర్ మునిప‌ల్లె. రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో జరిగిన నంది నాటక పరిషత్తు 2013లో ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ సంగీతం విభాగంలో నంది బహుమతులు వచ్చాయి.
ఈ నాటకం ప్రదర్శించదలచుకున్న వారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

విద్యాధర్ మునిపల్లె : 8522990888
నాయుడు గోపి       : 9440264975

ఈ నాటకం చదవదలచుకున్నవారు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయగలరు.

17, మే 2018, గురువారం

గమనం (సాంఘిక నాటిక) 2013

గమనం

సాంఘిక నాటిక

రచన : శ్రీ విద్యాధర్ మునిపల్లె బి.ఏ.,
దర్శకత్వం : శ్రీ నాయుడు గోపి
ఈ నాటిక 2013 ఎవికె ఫౌండేషన్ వారు అనంతపురంలో నిర్వహించిన నాటికల పోటీలకోసం రచించినది. నిజానికి విద్యాధర్ ని నాటక రచయితగా తెలుగు నాటకరంగానికి పరిచయం చేసిన తొలినాటిక ఇదే. దీనిని గంగోత్రి పెదకాకాని నాటక సమాజం వారు నిర్మించగా... నాయుడు గోపి గారు దర్శకత్వం వహించారు. కుటుంబ విలువలు, తరానికి తరానికి మధ్య వుండే అంతరాలు, అతి ప్రేమల ఫలితం తదితర అనేకానేక అంశాలతో కూడుకున్న నాటికే గమనం. ఈ నాటిక లింక్ కింద ఇస్తున్నాను. ప్రదర్శించదలచిన వారు సంప్రదించండి.. విద్యాధర్ సెల్ : 8522990888

ఇందులోని పాత్రలు
--------------------
విశ్వం
విఠల్
పీటర్
శ్యామ్
విజయ


దగ్ధగీతం (సాంఘిక నాటిక) 2017


దగ్ధగీతం 

సాంఘిక నాటిక
మూలకథ : శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య
నాటకీకరణ : శ్రీ  విద్యాధర్ మునిపల్లె బి.ఎ.,
దర్శకత్వం : శ్రీ నాయుడు గోపి

ఈ నాటిక ఎవికెఫౌండేషన్ వారు 2017 సంవత్సరం తుని వద్ద నిర్వహించిన కథానాటికల పోటీలకోసం విద్యాధర్ మునిపల్లె రచన చేయగా దీనిని గంగోత్రి పెదకాకాని సంస్థ నిర్మించింది. దీనికి నాయుడు గోపి గారు దర్శకత్వం చేపట్టారు. ఈ నాటిక లింక్ కింద ఇస్తున్నాను. నాటిక చదవదలచుకున్నవారు కింద ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేయగలరు. ప్రదర్శించాలనుకుంటే దీనిని 8522990888 (విద్యాధర్ మునిపల్లె) అనే నెంబరును సంప్రదించగలరు.

ఇందులోని పాత్రలు
--------------------

రవీంద్రనారాయణ్
సేతురామ్
దేవదాసు
పంకజవల్లి

కొత్తనీరు (సాంఘిక నాటిక) 2018

కొత్తనీరు (2018)

మూలకథ : విహారి

నాటకీకరణ,దర్శకత్వం : విద్యాధర్ మునిపల్లె బి.ఏ.,

కథాసారాంశం

ఏటికి కొత్తనీటి తాకిడి ఎంత సహజమో, కుటుంబం అన్నాక కొత్తతరాలు రావటం కూడా అంతే సహజం. కొత్తనీరు పాతనీటితో కలిసి ప్రవహించటం వల్లనే ఆ నీరు ఏటి ధర్మాన్ని నిలుపుకుంటుంది. కొత్తతరం పాతతరంతో కలిసి ప్రయాణించినప్పుడే కుటుంబం తన విలువను పెంచుకుంటుంది.  అనే సందేశంతో నాటిక సాగుతుంది. ఈ నాటికలోని పాత్రలు.


విశ్వనాథం (70)
రామ్మూర్తి (55)
చందు (27)
జగన్నాధం (65)
మాధవి (25)
సరళ (50)

ఈ నాటిక కావలసిన వారు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోగలరు. ప్రదర్శించుటకు విద్యాధర్ మునిపల్లె ను సంప్రదించగలరు. సెల్ : 8522990888.

యాది (సాంఘిక నాటిక)


యాది (సాంఘిక నాటిక)
మూలకథ : వారాల కృష్ణమూర్తి
నాటకీకరణ : శ్రీ చెరుకూరి సాంబశివరావు


కథా సారాంశం


                    దేశానికి అన్నం పెట్టే రైతులుఅర్థాంతరంగా ఆత్మహత్యలు చేసుకొని సచ్చిపోతే ఈ దేశం ఏమవుతుందని ఆలోచించలేక, రైతే రాజన్న సత్యాన్ని మరచిపోయి ఆత్మహత్యలు  సుకోవాలనుకునే ఎంతోమంది రైతులకు కనువిప్పు కలిగిస్తూ... ప్రతి రైతుకీ యాదిలాంటి భార్యే  ఉంటేఎంత కష్టం వచ్చినఎంత నష్టం వచ్చినా ఈ దేశంలో ఏరైతూ ఆత్మహత్య చేసుకోడు. పొలం ఈరోజు కాకపోతే రేపు పండనా అని ఎలా అనుకుంటుందో, కన్నీళ్ళతో పాత జీవితాన్ని కడిగేసుకొని, ముందుకు సాగుతున్న మనుషులై రేపును పండించాలనే సందేశంతో నాటిక సాగుతుంది.



ఇందులో :

లచ్చుంగాడు
యాదమ్మ
సేటు
క్రిష్ణయ్య
అనే పాత్రలుంటాయి.

ఈ నాటిక ప్రదర్శించాలనుకునేవారు చెరుకూరి సాంబశివరావుని సంప్రదించండి. సెల్ : 91-8801928670

ఈ నాటిక చదువుకోవాలనుకునేవారు ఈ క్రింది లింక్ ని ప్రెస్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.
యాది (సాంఘికనాటిక)

కన్యాశుల్కం నాటక ప్రతి



"కన్యాశుల్కం" గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం. తెలుగులో తొలి ఆధునిక రచనల్లో ఒకటిగా పేరుపొందింది. కన్యాశుల్కం నాటకం రెండు కూర్పులను రాసి ప్రచురించారు. మొదటి కూర్పు 1897 లో ప్రచురించబడింది. ఈ నాటకం మొట్టమొదటి ప్రదర్శన 1892 ఆగస్టు 13న విజయనగరంలో జరిగింది. అంతకు ముందు 5 సంవత్సరాల క్రితం ఈ రచన జరిగిందని తెలుస్తోంది. అయితే 1909లో ప్రచురించిన రెండవ కూర్పే ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొంది, ప్రజాదరణ పొందిన కన్యాశుల్కం.