తెలుగు నాటక వికాసము (పుస్తకం)


తెలుగు నాటక వికాసము 1960లో పి.ఎస్.ఆర్. అప్పారావు తెలుగు నాటకరంగం గురించి రాసిన పరిశోధన పుస్తకం. ఈ పుస్తకానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్ట లభించింది. తెలుగు నాటకరంగంలో 1960 వరకు దాదాపు రెండువేల నాటకాలు, నాలుగువేల ఏకాంకికలు, నాటికలు వచ్చాయి. సుమారు వేయిమంది ఏకాంకికా-నాటికా-నాటక-ప్రహసన రచయితలు ఉన్నారు. అయితే, వాటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం 1960 వరకు జరగలేదు. తొలినాళ్లలో వెలువడిన కొన్ని నాటకముల ప్రతులు దొరకలేదు. కొందరు నాటక రచయితల గురించిగానీ, ఆధునిక నాటకరంగ ప్రారంభమెప్పుడో, ఎవరుముందో, ఎవరు వెనుకో, నాటకరంగ వికాసం ఎలా జరిగిందో తెలుసుకొనుటకు తగిన ఆధారాలు సంపూర్ణంగా లభించలేదు. అలాంటి పరిస్థితుల్లో పి.ఎస్.ఆర్. అప్పారావు చాలా ప్రాంతాల్లో తిరిగి, ఎందరో వృద్ధ నటులను, నాటకకర్తలను, కళాభిమానులను కలిసి, తెలుగు నాటకరంగ చరిత్ర సమగ్ర నిర్మాణంకోసం చాలా సమాచారాన్ని సేకరించి, పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు.
కృతికర్త:పి.ఎస్.ఆర్. అప్పారావు
దేశం:భారత దేశము
భాష:తెలుగు
విభాగం(కళా ప్రక్రియ):తెలుగు నాటకరంగ పరిశోధన పుస్తకం
ప్రచురణ:శివాజీ ప్రెస్, సికింద్రాబాద్
విడుదల:1960
పేజీలు:846

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి